Breaking News

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే

Published on Fri, 12/27/2024 - 12:16

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai).. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఐయోనిక్ 5' (IONIQ 5) ఎలక్ట్రిక్ కారు తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 కారు అత్యంత ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కిన ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించడంతో.. గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ కారు లేహ్ లడఖ్‌లోని ఉమ్లింగ్ లా నుంచి సముద్ర మట్టానికి 5799 మీ (19,024 అడుగులు) ఎత్తులో కేరళలోని కుట్టనాడ్ వరకు ప్రయాణించింది.

మొత్తం 14 రోజులు 4900 కిమీ కంటే ఎక్కువ దూరం.. విభిన్న రహదారుల్లో, పలు వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఐయోనిక్ 5 విజయవంతంగా గమ్యాన్ని చేరుకుంది. ఈవో ఇండియా టీమ్ ఈ డ్రైవ్‌ను చేపట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హ్యుందాయ్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' (Unsoo Kim) మాట్లాడుతూ, ఐయోనిక్ 5 పర్ఫామెన్స్.. ఇంజినీరింగ్ నైపుణ్యం వంటివి తిరుగులేనివి. కంపెనీ విజయానికి, కస్టమర్ల నమ్మకానికి ఇది నిదర్శనం అని అన్నారు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5
హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై తయారైంది. స్మార్ట్ మొబిలిటీ అనుభవాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిర్దేశించింది.

ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!

ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా స్మార్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. దీని ధర రూ. 52.92 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)