Breaking News

'క్రెటా ఈవీ' రేంజ్ ఎంతో తెలిసిపోయింది: సింగిల్ ఛార్జ్‌తో..

Published on Thu, 01/02/2025 - 14:03

ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్' (Hyundai Motor) దేశీయ మార్కెట్లో 'క్రెటా' (Creta) కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది. కాగా అంతకంటే ముందే సంస్థ దీని రేంజ్ వివరాలను వెల్లడించింది.

మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' (Hyundai Creta EV) 51.4 కిలోవాట్, 42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందనుంది. 51.4 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జితో 473 కిమీ రేంజ్ అందించగా.. 42 కిలోవాట్ బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఈవీ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6, టాటా కర్వ్‌ ఈవీ, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ధర ఎంత వుంటుందనేది అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ.22 లక్షలు ఉండొచ్చని అంచనా.

చూడటానికి కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. బ్రాండ్ లోగో వద్ద ఛార్జింగ్ పోర్ట్, కొత్త సైడ్ ప్రొఫైల్, అప్డేటెడ్ రియర్ ఎండ్ వంటివన్నీ ఇందులో గమనించవచ్చు. మొత్తం మీద ఇది మార్కెట్లో దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)