Breaking News

జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర

Published on Sun, 09/07/2025 - 17:34

జీఎస్టీ సమావేశం తరువాత వచ్చిన ప్రతిపాదనలు.. కార్ల రేట్లను తగ్గేలా చేశాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని.. కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు.. వినియోగదారులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీంతో భారతదేశం అంతటా ఉన్న హ్యుందాయ్ కస్టమర్లు తమకు ఇష్టమైన హ్యుందాయ్ మోడళ్లను మరింత అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలరు. ఈ పండుగ సీజన్‌లో బ్రాండ్ కార్ల సేల్స్ పెరుగుతాయి.

ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించడానికి.. భారత ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టితో కూడిన చర్యను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' అన్నారు. ఈ సంస్కరణ ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ మార్గంలో పాయిస్తున్నప్పుడు.. ఆటోమొబైల్ రంగం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

జీఎస్టీ 2.0 అమలుతో.. హ్యుందాయ్ టక్సన్ కారు ధర గరిష్టంగా రూ. 2,40,303 వరకు తగ్గింది. గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 73,808 తగ్గింది. మోడల్ వారీగా తగ్గిన ధరలు ఎలా ఉన్నాయంటే..

➤గ్రాండ్ ఐ 10 నియోస్: రూ.73,808
➤ఆరా: రూ.78,465
➤ఎక్స్టర్: రూ.89,209
➤ఐ20: రూ.98,053
➤ఐ20 ఎన్ లైన్: రూ.1,08,116
➤వెన్యూ: రూ.1,23,659
➤వెన్యూ ఎన్ లైన్: రూ.1,19,390
➤వెర్నా: రూ.60,640
➤క్రెటా: రూ.72,145
➤క్రెటా ఎన్ లైన్: రూ.71,762
➤అల్కాజార్: రూ.75,376
➤టక్సన్: రూ.2,40,303

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)