Breaking News

హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..

Published on Wed, 04/16/2025 - 08:15

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్‌ నెలకొందని పేర్కొంది. ‘భారత్‌లో అధిక జనాభా, భారీ కన్జూమర్‌ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్‌ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్‌ కోసం భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్‌ సీఈవో శ్రీనివాస్‌ రావు తెలిపారు.

  • నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్‌ 4.4%, కోల్‌కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  • నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా...  

అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్‌ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.  గతేడాది(2024) న్యూయార్క్‌లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్‌కాంగ్‌లో 6%, సియాటిల్‌లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి. 

ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..

  • అయితే లండన్‌లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6  డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్‌లో 1.2%, సింగపూర్‌ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)