Breaking News

హైదరాబాద్‌ మార్కెట్లో జోరుగా ఇళ్ల అమ్మకాలు

Published on Fri, 04/07/2023 - 06:28

హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో జోరుగా సాగాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 55 శాతం అధికంగా 10,200 యూనిట్లు విక్రయమయ్యాయి. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 6,560గా ఉన్నాయి. ఈ వివరాలను ప్రాపర్టీ పోర్టల్‌ ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది.  దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 22 శాతం పెరిగినట్టు, అదే కాలంలో ఇళ్ల సరఫరాలో 86 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది.

ఎనిమిది పట్టణాల్లోకి ఇళ్ల అమ్మకాల పరంగా ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌ రి యల్టీ మార్కెట్లోనే నమోదు కావడం గమనార్హం. ఎనిమిది పట్టణాల్లో కలిపి జనవరి–మార్చి కాలంలో 85,850 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పట్టణాల్లో అమ్మకాలు 70,630 యూనిట్లుగా ఉన్నాయి. కొత్తగా ఇళ్ల సరఫరా 1,47,780 యూనిట్లుగా ఉంది. గృహ రుణాలపై గతేడాది నుంచి వడ్డీ రేట్లు 2.5 శాతం వరకు పెరిగినప్పటికీ, అమ్మకాలు బలంగానే ఉన్నట్టు పలు ఇతర నివేదికలు సైతం వెల్లడించాయి.

‘‘విక్రయాలు, కొత్త ఇళ్ల సరఫరా పరంగా భారత హౌసింగ్‌ మార్కెట్‌ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్లు, మరోవైపు దేశీయంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఈ పరిస్థితిని సానుకూలమనే చెప్పుకోవాలి’’అని ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో వికాస్‌ వాధ్వాన్‌ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల్లోనూ చెప్పుకోతగ్గ వృద్ధి కనిపిస్తుండడం, మార్కెట్‌లో డిమాండ్‌ పట్ల డెవలపర్లలో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని ప్రాప్‌ టైగర్‌ నివేదిక పేర్కొంది.  

పట్టణాల వారీగా..
► ముంబై మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 39 శాతం పెరిగాయి. 32,380 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 23,370 యూనిట్లుగా ఉన్నాయి.  
► పుణె మార్కెట్లో అమ్మకాలు 16 శాతం వృద్ధి చెంది 18,920 యూనిట్లుగా ఉన్నాయి.  
► అహ్మదాబాద్‌లో 31% అధికంగా 7,250 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.  
► చెన్నై మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి.
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మార్చి త్రైమాసికంలో 24 శాతం తగ్గి 3,800 యూనిట్లకు పరిమితమయ్యాయి.  
► బెంగళూరులోనూ 3% అమ్మకాలు తగ్గాయి. 7,440 యూనిట్లు అమ్ముడుపోయాయి.  
► కోల్‌కతా మార్కెట్లో 22 శాతం తక్కువగా 2,230 యూనిట్లు విక్రయమయ్యాయి.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)