Breaking News

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాజసం

Published on Tue, 07/28/2026 - 12:48

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కీలకంగా మారింది. సాంకేతిక రంగాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. నగరం పరిధి దాటి విస్తరిస్తున్నా, మరోవైపు రీ-డెవలప్‌మెంట్ రూపంలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు సైతం సరికొత్త లగ్జరీలతో కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి.

నలుదిక్కులా రియల్టీ జోరు: ఏ దిశలో ఏముంది?

విశ్వనగర ఐటీ కారిడార్

నగరానికి పశ్చిమంలో కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నార్సింగి వంటి ప్రాంతాలున్నాయి. ఐటీ/ఐటీఈఎస్ దిగ్గజ కంపెనీల విస్తరణ, అల్ట్రా-లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడి వృద్దికి ప్రధానం. అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, గ్లోబల్ లైఫ్‌స్టైల్ అత్యంత ఎక్కువ మూలధన వృద్ధిని, స్థిరమైన అద్దె ఆదాయాన్ని అందిస్తున్నాయి.

ఉత్తర హైదరాబాద్.. పరిశ్రమలు, గ్రీన్ లివింగ్

కొంపల్లి, బాచుపల్లి, దూలపల్లి, మేడ్చల్.. ఇక్కడ  ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-44), జీనోమ్ వ్యాలీ ఐటీ-ఫార్మా కారిడార్ ఉండడం ఇక్కడి వృద్ధికి కారణం. తక్కువ ధరల్లో లగ్జరీ విల్లాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉండడంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులు ఇటువైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

తూర్పు హైదరాబాద్

ఉప్పల్, ఎల్‌బీ నగర్, పోచారం, నాగోల్.. వంటి ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం చేపట్టిన గ్రిడ్‌ విధానంతో ఈస్ట్ జోన్‌లో నూతన ఐటీ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైలు సదుపాయం విస్తృతంగా ఉండటంతో రీసేల్ మార్కెట్, మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ గణనీయంగా పుంజుకుంది.

దక్షిణ నగరం.. ఏరోస్పేస్, లాజిస్టిక్స్ బూమ్

శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, మహేశ్వరం.. వంటివి ఈ ప్రాంత రియల్టీ వృద్ధికి కీలకం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఆదిబట్ల ఏరోస్పేస్/డిఫెన్స్ పార్క్, లాజిస్టిక్స్ హబ్‌లు ఇందులో భాగమయ్యాయి. విశాలమైన ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్రాజెక్టులు, ఫార్మా రంగానికి అనువైన వాతావరణం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారాయి.

నగర నడిఒడ్డున ‘ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్’

హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తున్నప్పటికీ కొద్దికాలంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు, సొంత ఇంటి కల ఉన్న కుటుంబాలు నగర నడిఒడ్డున ఉన్న ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్ బెల్ట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, లగ్జరీ హైరైజ్ ప్రాజెక్టులతో సరికొత్త వెలుగులు సంతరించుకుంటోంది. దీనికి గల కారణాలు కింద చూద్దాం.

మెరుగైన కనెక్టివిటీ

ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, నాంపల్లికి, అసెంబ్లీకి లేదా ఐటీ కారిడార్‌లకు చేరుకోవడం చాలా సులభం. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉండటం వల్ల నగరంలోని ఏ మూలకైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ప్రతి 2-3 నిమిషాలకు నగరంలోని అన్ని దిక్కులకూ ఆర్టీసీ బస్సు సర్వీసులు లభిస్తాయి.

ఎడ్యుకేషనల్ హబ్

తల్లిదండ్రులు తమ పిల్లల విద్యార్హతల కోణంలో ఇక్కడ ఇల్లు కొనడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరంలోనే దాదాపు అన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. దాంతోపాటు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం అతి సమీపంలో ఉంది. సివిల్స్, గ్రూప్స్, నీట్/జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రధాన కేంద్రాలన్నీ (అశోక్ నగర్, చిక్కడపల్లి) ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌కు అనుకొని ఉండటంతో విద్యార్థులకు, కుటుంబాలకు ఇది సరైన నివాస ప్రాంతంగా తోస్తుంది.

ఉపాధికి, బిజినెస్‌కు సెంటర్‌ పాయింట్‌

ఐటీ నిపుణులకు మెట్రో ద్వారా మైండ్ స్పేస్, హైటెక్ సిటీలకు సులభమైన ప్రయాణ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వ్యాపార సంస్థలు, చుట్టుపక్కలే ఉండటంతో నిత్యం ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటోంది.

సాంస్కృతిక, వినోద, వైద్య మౌలిక సదుపాయాలు

ఐకానిక్ సినిమా థియేటర్ల కాంప్లెక్స్‌లకు ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ నిలయం. కిమ్స్, యశోధ, సన్‌షైన్, నిమ్స్.. వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 10-15 నిమిషాల ప్రయాణ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్ లగ్జరీ బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు సమీపంలో ఉంది.

లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు

గతంలో ఇక్కడ ఇండిపెండెంట్ ఇళ్లు లేదా చిన్న అపార్ట్‌మెంట్లు ఎక్కువగా ఉండేవి. కానీ, పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి దిగ్గజ బిల్డర్లు ఇక్కడి స్థలాలను సేకరించి అల్ట్రా-లగ్జరీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. క్లబ్‌హౌస్‌లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన పార్కులు, 100 శాతం వాస్తు అనుకూలతలు, ట్రిపుల్ లెవల్ పార్కింగ్ సదుపాయాలతో కూడిన భవనాలు ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ ఆస్తుల విలువ నిలకడగా భారీగా పెరుగుతోంది.

అవుటర్ ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటే ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వంటి నగర నడిబొడ్డు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిస్థాయి సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సిద్ధంగా ఉన్నాయి. రోజువారీ ప్రయాణ సమయాన్ని తగ్గించుకుంటూ విద్య, వైద్యం, ఉపాధి, వినోదాలను ఇంటికి సమీపంలోనే కావాలనుకునేవారికి, నిలకడైన అద్దె ఆదాయం ఆశించే పెట్టుబడిదారులకు ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ ఒక సేఫ్ ఆప్షన్‌గా అవతరించింది.

ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)