హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..

Published on Tue, 01/21/2025 - 14:25

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.

ప్రీమియం ప్రాపర్టీస్

హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.

జిల్లాల వారీగా..

రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.

ప్రాపర్టీ పరిమాణాల వారీగా..

ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.

ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద

నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్‌కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)