Breaking News

భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..

Published on Fri, 03/28/2025 - 07:23

హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెల ల్లో ఇళ్ల అమ్మకాలు బలహీనతను ఎదుర్కొన్నాయి. క్రితం ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 28 శాతం తక్కువగా 93,280 యూనిట్ల అమ్మకాలే నమోదవుతాయన్నది ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అనరాక్‌ అంచనా వేసింది. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో (క్యూ1)లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,30,170 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 49 శాతం తగ్గి 10,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా. 2024 మొదటి క్వార్టర్‌లో 19,660 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ‘‘ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత హౌసింగ్‌ మార్కెట్‌ బుల్‌ ర్యాలీని 2025 క్యూ1లో నిదానించేలా చేశాయి’’అని అనరాక్‌ తన నివేదికలో పేర్కొంది.  

పట్టణాల వారీగా విక్రయ అంచనాలు

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో జనవరి–మార్చి మధ్య అమ్మకాలు 20 శాతం తక్కువగా 12,520 యూనిట్లకు పరిమితం కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో ఇక్కడ 15,650 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

  • ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో విక్రయాలు 26 శాతం క్షీణించి 31,610 యూనిట్లకు పరిమితమయ్యాయి.

  • బెంగళూరులో అమ్మకాలు 16% తక్కువగా 15,000 యూనిట్లకు పరిమితం కావొచ్చు.

  • పుణెలోనూ క్రితం ఏడాది క్యూ1తో పోల్చి చూస్తే 30 శాతం తగ్గి 16,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా.

  • చెన్నైలో అమ్మకాలు 26 శాతం క్షీణించి 4,050 యూనిట్లుగా ఉంటాయి.

  • కోల్‌కతా మార్కెట్లోనూ 31 శాతం తక్కువగా 3,900 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో అమ్మకాలు 5,650 యూనిట్లుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి

ప్రతికూల పరిస్థితుల వల్లే..  

‘‘దేశ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా యి. అంతర్జాతీయంగా చూస్తే దేశ జీడీపీ అత్యధిక వృద్ధి రేటును సాధించగా, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉంది. అదే సమయంలో ఇళ్ల ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ లావాదేవీలపై ప్రభావం చూపించాయి. ఈ పరిణామాలన్నీ కలసి క్యూ1లో దేశ హౌసింగ్‌ మార్కెట్‌ను నిదానించేలా చేశాయి’’అని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)