Breaking News

హైదరాబాద్‌లో రియల్టీ జోరు!

Published on Sat, 11/16/2024 - 09:13

హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్‌ తాజా అధ్యయనం వెల్లడించింది.

గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్‌ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్‌ జోన్‌లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.

లక్ష దాటిన ఇన్వెంటరీ..

హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.

3–5 శాతం ధరల వృద్ధి..

నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్‌లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!

లగ్జరీ గృహాలే ఎక్కువ..

నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)