Breaking News

హైదరాబాద్‌లో జోరుగా ఇళ్ల అమ్మకాలు

Published on Tue, 07/04/2023 - 05:50

న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాల పరంగా హైదరాబాద్‌ మార్కెట్‌ ఈ ఏడాది ప్రధమార్ధంలో మంచి పనితీరు చూపించింది. జనవరి–జూన్‌ మధ్య అమ్మకాలు 24 శాతం పెరిగాయి. 17,890 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే ఆరు నెలల కాలంలో విక్రయాలు 14,460 యూనిట్లుగా ఉండడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ ఈ వివరాలు విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలంలో ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయి.

1,66,090 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,44,950 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 26 శాతం తగ్గి 7,040 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులోనూ అమ్మకాలు 11 శాతం తగ్గి 14,210 యూనిట్లుగా నమోదయ్యాయి. కోల్‌కతాలో 31 శాతం తగ్గి 4,170 యూనిట్లు అమ్ముడుపోగా, అహ్మదాబాద్‌లో మాత్రం 23 శాతం వృద్ధితో 15,710 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చెన్నైలో 2 శాతం పెరిగి 6,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 49,520 యూనిట్ల నుంచి 62,630 యూనిట్లకు పెరిగాయి. పుణెలో అమ్మకాలు 30,030 యూనిట్ల నుంచి 37,760 యూనిట్లకు
వృద్ధి చెందాయి. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)