Breaking News

హైదరాబాద్‌-దిల్లీ విమానాలు.. 29 ఆలస్యం.. 13 దారి మళ్లింపు.. కారణం తెలుసా..

Published on Tue, 01/16/2024 - 17:55

హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు కొంత కష్టంగా మారాయి. మరోవైపు విమానాశ్రయంలో కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. 

అత్యవసరంగా టేకాఫ్‌ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) ద్వారా ప్రయాణం సాగిస్తున్న పలు  విమానాలను దారి మళ్లించారు. గడిచిన రెండురోజుల్లో హైదరాబాద్‌-దిల్లీ మధ్య ప్రయాణాలు సాగిస్తున్న 29 విమానాల ప్రయాణ సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. జనవరి 14న 14 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 6 విమానాలను ఆర్‌జేఐఏ నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. 

జనవరి 15న 15 విమానాల ప్రయాణం ఆలస్యం అయింది. ఏడు విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు, దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక విమానంను సంబంధిత అధికారులు దారి మళ్లించారు.

ఇదీ చదవండి: భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - సీఈఓ

రానున్న 4-5 రోజుల పాటు నార్త్‌ ఇండియాలో దట్టమైన పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దాంతో ఈ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని ముందుగానే ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)