Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ

Published on Fri, 08/30/2024 - 02:08

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్‌ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.

అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు.    తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. 

మరిన్ని విశేషాలు.. 
⇒ హురున్‌ టాప్‌–5 జాబితాలో హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్‌ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైరస్‌ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు.  
⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.

టాప్‌–3లో హైదరాబాద్‌.. 
17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్‌ తొలిసారిగా బెంగళూరును  అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్‌), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్‌.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్‌), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్‌), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్‌), ప్రతాప్‌ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్‌కేర్‌), పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు.  

 

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)