ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్‌ ఫోన్‌

Published on Wed, 09/11/2024 - 01:22

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్‌ చరిత్రలో కొత్త అధ్యాయానికి చైనా దిగ్గజం హువావే తెరలేపింది. మేట్‌ ఎక్స్‌టీ పేరుతో ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు దశల్లో ఫోల్డ్‌ చేసేలా 3కే రిజొల్యూషన్, ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో ఇది రూపుదిద్దుకుంది. పూర్తిగా ఫోల్డ్‌ చేస్తే 6.4 అంగుళాల స్మార్ట్‌ ఫోన్‌గా వాడుకోవచ్చు. కొంత భాగం ఓపెన్‌ చేస్తే 7.9 అంగుళాలు, పూర్తిగా తెరిస్తే 10.2 అంగుళాల ట్యాబ్లెట్‌ పీసీ మాదిరి సింగిల్‌ స్క్రీన్‌గా మారిపోతుంది. 27 లక్షల పైచిలుకు యూనిట్లకు ప్రీ ఆర్డర్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్‌ ఫోన్లకు ప్రైమరీ స్క్రీన్, కవర్‌ డిస్‌ప్లే మాత్రమే ఉన్నాయి.  ట్రై–ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు. ప్రస్తుతానికి చైనాకే పరిమితం. సెపె్టంబర్‌ 20 నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. బరువు 298 గ్రాములు. పూర్తిగా ఫోల్డ్‌ చేసినప్పుడు 3.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)