Breaking News

సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ ఇలా అప్‌డేట్ చేసుకోండి

Published on Wed, 01/17/2024 - 16:19

ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌తో పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు, కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన 'నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI).. అలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే అంటూ ఆదేశాలను జారీ చేస్తూ ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించింది.

జనవరి 31 నాటికి కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్‌ట్యాగ్‌లు డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వినియోగదారుడు నిర్దిష్ట సమయంలోనే కేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ చెక్ చేసుకోవడం ఎలా?
👉వినియోగదారుడు ముందుగా ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
👉ఓటీపీ అథెంటికేషన్‌ పూర్తయిన తరువాత.. డాష్‌బోర్డ్‌లో 'మై ప్రొఫైల్' అనే సెక్షన్‌లో KYC స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు.

కేవైసీ అప్డేట్ చేయడం ఎలా?
👉ఫాస్ట్‌ట్యాగ్‌ కేవైసీ చెక్ చేసుకున్న తరువాత.. పెండింగ్‌లో ఉన్నట్లు తెలిస్తే.. కేవైసీ సబ్‌ సెక్షన్‌ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.
👉దీని కోసం అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్.. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్వంటి వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది.
👉ఇవన్నీ సబ్మిట్ చేసిన తరువాత చెక్ చేసి, చివరిగా సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
👉తర్వాత 'కంటిన్యూ'పై క్లిక్ చేసి, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి సబ్మిట్‌ చేస్తే కేవైసీ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)