Breaking News

చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!

Published on Wed, 12/24/2025 - 14:18

బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్‌ బ్యాంకులతోపాటు పేమెంట్‌ బ్యాంకులని, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.

బ్యాంకుల వర్గీకరణ ఇలా..  
దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.

వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్‌ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌.. వంటివి.

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స​ బ్యాంక్‌ వంటివి ఉదాహరణలు.

ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి సంస్థలు.

ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్‌గ్రేడ్‌ అ‍య్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్‌ బ్యాంకులకు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులుగా, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు యూనివర్సల్‌ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.

ఏయూ స్మాల్‌ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతి
రిజర్వ్‌ బ్యాంక్‌ 2025లో ఏయూ ఫైనాన్స్‌ స్మాల్‌ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్‌ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్‌ బ్యాంక్‌గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్‌ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్‌లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.

పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్‌ అకౌంట్స్‌పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.

పేమెంట్‌ బ్యాంకుకు ప్రమోషన్‌
2025లో ఆర్బీఐ మరో పేమెంట్‌ బ్యాంకుకు కూడా ప్రమోషన్‌ ఇచ్చింది. ఫినో పేమెంట్స్‌ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్‌ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.

ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు