Breaking News

మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!

Published on Mon, 10/14/2024 - 11:58

సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్‌ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్‌ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్‌ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదాహరణకు..విజయ్‌ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్‌ తీసుకున్నాడని అనుకుందాం. లోన్‌ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్‌ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.

ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..

నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)