Breaking News

ఇలా చేస్తే మీ అప్పు రికవరీ అవ్వాల్సిందే..!

Published on Mon, 10/07/2024 - 11:28

ఎవరికైనా అప్పు ఇచ్చారా..? తిరిగి చెల్లించడం లేదా..? అయితే కింద తెలిపిన విధంగా చేస్తే దాదాపు మీ డబ్బు తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు మీరు డబ్బు ఇచ్చినట్లు రుజువులు మాత్రం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకు స్టేట్‌మెంట్‌ వంటి ధ్రువపత్రాలు అవసరం అవుతాయి. ఒకవేళా గూగుల్‌పే, ఫోన్‌పే..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా పేమెంట్‌ చేసినా బ్యాంక్‌ ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

అప్పు ఇచ్చాక చెప్పిన సమయానికి తిరిగి చెల్లించకుండా చాలామంది కాలయాపన చేస్తూంటారు. అలాంటి సందర్భంలో అప్పు తీసుకున్నట్లు మీ వద్ద ఉన్న రుజువులతో లీగల్‌గా అడ్వకేట్‌ ద్వారా నోటీస్‌ పంపవచ్చు. దాంతో చాలా వరకు ఆ లీగల్‌ నోటీసుకు బయపడి మీ అప్పు తీర్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరు అలా నోటీసులు స్వీకరించినా అప్పు చెల్లించరు.

ఇదీ చదవండి: భారత హాకీ స్టార్‌కు చేదు అనుభవం!

లీగల్‌ నోటీసులు అందుకుని అప్పు చెల్లించని వారికోసం మాత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. స్టేషన్‌ ద్వారా మనీసూట్‌ను పంపించాలి. అప్పు తీసుకున్న వారు దానికి స్పందించకపోతే కోర్టు ద్వారా తమను అదుపులోకి తీసుకుని వివరణ కోరే అవకాశం ఉంటుంది. అయితే అసలు అప్పు ఇవ్వడమే ఖర్చు..మళ్లీ పోలీస్‌ స్టేషన్‌, కోర్టు చుట్టూ తిరగాలంటే అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అలాంటి వారు మనీసూట్‌లో అందుకు అయ్యే ఖర్చును సైతం పొందేలా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుతోపాటు దాని రికవరీకి అయిన ఖర్చును సైతం తిరిగి చెల్లించాల్సిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)