Breaking News

పెట్రోల్‌ అప్‌.. డీజిల్‌ డౌన్‌!

Published on Wed, 10/02/2024 - 16:49

దేశంలో సెప్టెంబర్‌ నెలలో ఇంధనాల వాడకం మిశ్రమంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో పెట్రోల్‌ అమ్మకాలు అంతకుముందు నెలతో పోలిస్తే 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. ఈమేరకు చమురు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది.

మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం..దేశీయంగా లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పీజీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో అంతకుముందు నెలతో పోలిస్తే 1% పెరిగాయి. పెట్రోల్‌ అమ్మకాలు 2.8% పెరిగాయి. డీజిల్ విక్రయాలు 2% తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల సగటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఇంధనాల వినిమయ వృద్ధి రేటు తక్కువగా ఉంది. అయితే విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడంతో జెట్‌ ఇంధన విక్రయాలు మాత్రం గణనీయంగా 9.5% పెరిగాయి.

ఇదీ చదవండి: రోజూ 50 కోట్ల లావాదేవీలు..!

దేశీయంగా చమురు వినియోగం తగ్గేందుకు ప్రధాన కారణం..చమురుకు బదులుగా వినియోగదారులు పునరుత్పాదక ఇంధనాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించడమని నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి జెట్ ఇంధనం ధర సమ్మిళిక వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌) 2% ఉంది. డీజిల్‌ 1.7%, ఎల్‌పీజీ 4.5%, పెట్రోల్‌ ధరలు 5.8% సీఏజీఆర్‌ చొప్పున వృద్ధి చెందాయి. ఇదిలాఉండగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీ) మాత్రం అందుకు అనుగుణంగా ఇంధన ధరలు తగ్గించడంలేదనే వాదనలున్నాయి. ఓఎంసీలు ఫ్యుయెల్‌ ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)