వర్షంలో తడిసిన ఆ నలుగురే ‘నానో’కు పునాది

Published on Thu, 10/10/2024 - 12:00

రతన్‌ టాటాతోపాటు గతంలో సంస్థ పగ్గాలు చేపట్టిన సారథులు ఇండియాను ఒక ఎకనామిక్ సూపర్ పవర్‌గా చూడాలనుకున్నారు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా కృషి చేశారు. అందులో భాగంగానే రతన్‌ టాటా ‘నానో’ కారును విడుదల చేశారు. అయితే ఈ కారు ఆవిష్కరణకు పునాది ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఒకసారి రతన్‌టాటా తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక దంపతులిద్దరు, ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారట. అంతే..వెంటనే ఆయన పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా దాదాపు రూ.ఒక లక్ష ధర ఉండేలా ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ఈ మాట చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. లక్ష రూపాయల్లో కారుని ఎలా తయారు చేస్తారు? అని భయపెట్టారు. కొంత మంది వెటకారం చేశారు. కానీ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజినీర్లను పిలిపించారు. కానీ వారు లక్ష రూపాయల్లో కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా అంతటితో ఆగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ‘నానో’ను ఆవిష్కరించారు. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వల్ల నానో కారు విఫలమైంది. నానో కారు తయారుచేయడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.

ఇదీ చదవండి: ‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’

రతన్ టాటా వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్‌లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దాంతో మొత్తం ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)