Breaking News

మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదమే!

Published on Sat, 08/12/2023 - 18:51

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తున్నారు. ఇలాంటి నంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేసినట్లు సమాచారం.

టెలికామ్ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించించినట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలుస్తోంది. మొత్తం మీద సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..

టెలికామ్ సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఓ కొత్త వెబ్‌సైట్‌ తీసుకువచ్చింది. దీంతో ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయం మాత్రమే కాకుండా.. మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో అయినా నెంబర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది.

ఇలా తెలుసుకోండి..

  • మొదట సంచార్ సతి అధికారిక వెబ్‌సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.
  • అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద క్లిక్ చేయాలి. 
  • కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసిన తరువాత, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది.
  • అందులో మీది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)