Breaking News

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు: ఎలా చేయాలంటే..

Published on Mon, 02/24/2025 - 13:36

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. యూపీఐ చెల్లింపులు చేయడం సాధ్యం కాదని అందరూ అనుకుంటారు. కానీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ట్రాన్సక్షన్ ఎలా చేయాలి?.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్‌పీసీఐ ప్రారంభించిన *99# సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీ చేయవచ్చు, యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లింపు చేయడం ఎలా..
➤మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# కు డయల్ చేయండి.
➤డయల్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.
➤మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేసిన తరువాత.. మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితా కనిపిస్తుంది.
➤కావాల్సిన ఖాతాను ఎంచుకోవాలి. ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి.. డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయాలి.
➤యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేయకపోతే.. సెట్ చేసుకోవాలి. ఈ పిన్ లావాదేవీలను నిర్దారించడానికి ఉపయోగపడుతుంది.

డబ్బు పంపించాలంటే..
➤మీ ఫోన్‌లో *99# డయల్ చేసిన తరువాత.. డబ్బు పంపడానికి ఆప్షన్ ఎంచుకోవాలి.
➤ఆ తరువాత ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో.. వారి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయడానికి కావలసిన ఆప్షన్ ఎంచుకోవాలి.
➤మీరు పంపించాలనుకున్న మొత్తాన్ని.. ఎంటర్ చేసి చేసిన తరువాత.. లావాదేవీలను ధృవీకరించడానికి పిన్ నెంబర్ నమోదు చేయండి.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)