Breaking News

ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధర!

Published on Fri, 10/18/2024 - 13:37

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా బంగారం ధరలు పెరుగుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. కనకం ధర పాతికేళ్ల కాలంలో ఊహించని స్థాయిలో పెరిగి కొండెక్కింది. గురువారం మార్కెట్‌లో మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.79 వేల మార్కును దాటింది. 2000 సంవత్సరంలో తులం బంగారం రూ. 4,400 ఉండగా ఇప్పుడు రూ.79 వేలకు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో ఏ వస్తువుగానీ, లోహం ధరగానీ ఈ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు. భారతీయులకు బంగారమంటే మక్కువ ఎక్కువ. శుభకార్యాలలో ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు ఆభరణాలను ధరిస్తుంటారు. కానుకలుగా బంగారం ఇస్తుంటారు.

పెళ్లిళ్లలో అయితే తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5 తులాల బంగారం కట్నంగా పెట్టాల్సిందే. ఐదు తులాలు అంటే ప్రస్తుతం రూ. 4 లక్షలు అవుతుంది. ధర భారీగా పెరగడంతో సామాన్యులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. చాలామంది బంగారు ఆభరణాలను కొనలేని పరిస్థితిలో ఇమిటేషన్‌ జ్యువెలరీని ఆశ్రయిస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలపై కామారెడ్డికి చెందిన మూడు తరాలవారితో ‘సాక్షి’ మాట్లాడింది. ఒక తరంలో ఉన్న ధరకు, తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.


నూరు రూపాయలుండే..
నా పెళ్లి 1954 సంవత్సరంలో అయ్యింది. అప్పుడు బంగారం తులం నూరు రూపాయలు ఉండేది. అప్పుడు ధర తక్కువే అయి నా సంపాదన కూడా తక్కువగానే ఉండేది. ఇప్పుడు ధరలు చాలా పెరిగి పోయాయి. బంగారం ధర వింటేనే భయమేస్తుంది.
– పొగాకు నర్సుబాయి, కామారెడ్డి


తులానికి రూ. 1400 ఉండేది..
నా పెళ్లి 1980 లో జరిగింది. అప్పట్ల తులం బంగారం ధర రూ. 1,400 ఉండేది. ఆ ధర ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది కానీ అప్పటిది అప్పుడు, ఇçప్ప టిదిప్పుడు అన్నట్టుగా నే ఉంది. బంగారం ధరలు బాగా పెరిగి, సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి చేరింది.
– మైలారపు అంజలి, పొగాకు నర్సుబాయి కూతురు, కామారెడ్డి


తులానికి రూ.5,500 ఎక్కువ అనుకున్నం...
నా వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. అప్పుడు తులం బంగారం ధర రూ.5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ అనుకున్నం. తరువాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు రూ.79 వేలు అంటుంటే ఆశ్చర్యపోతున్నాం. ఇరవై ఏళ్లల్లో ధర అడ్డగోలుగా పెరిగింది. 
– ముప్పారపు అపర్ణ, పొగాకు నర్సుబాయి మనవరాలు, కామారెడ్డి 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)