Breaking News

ఎకో-ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌లో మీ ఇంటికి దీపావళి కళ కావాలంటే!

Published on Sat, 10/22/2022 - 11:18

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్‌ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్‌ రావాలంటే ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ రెండు చోట్లా డెకరేటివ్‌ చేస్తే ఎకో-ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు. 
 సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్‌ లేదా మార్బుల్‌ పళ్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్‌ ధరల్లో వినూత్న డిజైన్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్‌ దీపాంతలు కూడా లభ్యమవుతాయి.

♦ ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్‌ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.  వైర్‌లెస్‌ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు.  ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్‌ ఎంట్రెన్స్‌ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్‌ వంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్‌ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 

 రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. 

 మట్టి దీపాంతలు, లాంతర్లకు బదులు అకార్డియన్‌ పేపర్‌ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశ్మిని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి

Videos

వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు: పంకజశ్రీ

పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)