ఏసీ క్లీనింగ్‌ ఇలా ఈజీ!

Published on Sat, 03/14/2026 - 12:15

మార్చి నెల.. ఎండ... ఉక్కపోతను తట్టుకోవాలంటే ఏసీ ఆన్‌ చేయాల్సిందే. అయితే నెలల తరబడి వాడకుండా వదిలేసిన ఏసీని ఇప్పుడు సడెన్‌గా ఆన్‌ చేస్తే గది త్వరగా చల్లబడదు. పోనీ సర్వీసింగ్‌ కోసం టెక్నీషియన్‌ను పిలుద్దామంటే బోలెడంత ఖర్చు. అయితే ఎలాంటి ప్రొఫెషనల్‌ టూల్స్‌ అవసరం లేకుండానే, కేవలం ఓ పాత టూత్‌ బ్రష్, కొద్దిగా నీళ్లతో మీ ఏసీని మీ చేతులతోనే కొత్తదానిలా క్లీన్‌ చేసుకోవచ్చు.

క్లీనింగ్‌ మొదలుపెట్టే ముందు ఏసీ పవర్‌ ఆఫ్‌ చేసి, ప్లగ్‌ తీసేయడం మరచిపోవద్దు. కరెంట్, నీళ్లు కలిస్తే చాలా ప్రమాదం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

స్టెప్‌ 1: ఫిల్టర్లతో మొదలుపెట్టాలి. విండో ఏసీ అయినా, స్ప్లిట్‌ ఏసీ అయినా ఫ్రంట్‌ కవర్‌ ఓపెన్‌ చేయగానే మెష్‌ ఫిల్టర్లు కనిపిస్తాయి. గదిలోని దుమ్ము, చెత్తాచెదారాన్ని ఇవే ఆపుతాయి. వీటిని బయటకు తీసి ట్యాప్‌ కింద పెట్టి ఫోర్స్‌గా వచ్చే నీటితో శుభ్రంగా కడగాలి. డస్ట్‌ అంతా పోయి ఫిల్టర్లు పారదర్శకంగా కనిపించేలా కడిగాక పక్కన ఆరబెట్టాలి. ఈ ఒక్క పనితోనే సగం గాలి ఫ్రీగా వస్తుంది.

స్టెప్‌ 2: కాయిల్స్‌ క్లీనింగ్‌: ఫిల్టర్ల వెనుక అల్యూమినియంతో చేసిన సన్నటి కూలింగ్‌ కాయిల్స్‌ (ఫిన్స్‌) ఉంటాయి. చల్లటి గాలి వచ్చేది అక్కడి నుంచే కాబట్టి వీటి క్లీనింగ్‌ జాగ్రత్తగా చేయాలి. ఇందుకోసం పాత టూత్‌బ్రష్‌ను నీళ్లలో ముంచి, ఈ కాయిల్స్‌పై పైనుంచి కిందకు సున్నితంగా రుద్దాలి. బ్రష్‌ను మధ్యమధ్యలో నీళ్లలో కడుగుతూ మురికిని తొలగించాలి. గట్టిగా రుద్దితే ఆ సన్నటి కాయిల్స్‌ వంగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి పైపైన మెల్లగా క్లీన్‌ చేయాలి.

స్టెప్‌ 3: విండో, ఔట్‌డోర్‌ యూనిట్‌ క్లీనింగ్‌: మీది విండో ఏసీ అయితే, వెనుక వైపు కూడా కాయిల్స్‌ ఉంటాయి. వాటర్‌ పైపుతో ఆ కాయిల్స్‌పై నీళ్లు కొడుతూ మురికిని కడిగేయాలి. లోపలి మోటార్‌పై నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి. స్ప్లిట్ ఏసీ (Splict AC) అయితే.. బయట డాబా మీద లేదా గోడకు ఉండే ఔట్‌డోర్‌ యూనిట్‌ను క్లీన్‌ చేయాలి. దీని చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, బూజును వాటర్‌ పైపుతో ఫోర్స్‌గా కొట్టి క్లీన్‌ చేయాలి. ఇది శుభ్రంగా ఉంటే ఏసీ వేడిని ఈజీగా బయటకు పంపుతుంది.

స్టెప్‌ 4: ఆరేదాకా వెయిట్‌ చేయాలి: క్లీనింగ్‌ అంతా అయిపోయిన వెంటనే ఏసీ ఆన్‌ చేయకూడదు. ఎందుకంటే లోపల నీటి తడి అలాగే ఉంటుంది కాబట్టి కనీసం గంటన్నర పాటు దాన్ని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే ప్లగ్‌ పెట్టి ఆన్‌ చేయాలి. ఇప్పుడు ఏసీ ఆన్‌ చేస్తే... గాలి ఫ్లో, కూలింగ్‌ ఎఫెక్ట్‌ మీకే అర్థమవుతుంది. ఈ సాఫ్ట్‌ సర్వీసింగ్‌తో ఏసీ కూలింగ్‌ పెరగడం ఖాయం. అయితే ఇది టెక్నీషియన్‌ చేసే పనికి ప్రత్యామ్నాయం కాదు. ఏసీలో గ్యాస్, ఇతరత్రా ఏమైనా పార్టులు పోతే టెక్నీషియన్‌ రావలసిందే! 

చ‌ద‌వండి: ఇల్లు కొనాలంటే ఈ వ‌స‌తులు ఉండాల్సిందే

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)