Breaking News

కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి!

Published on Tue, 07/27/2021 - 18:52

ఈ మధ్య కంపెనీలు కరోనా మహమ్మారి కారణంగా తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. చాలా కంపెనీలు గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ కింద ఉద్యోగులను కవర్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక ఆ ఫార్మాలిటీస్ సరిగ్గా నింపనట్లయితే మీకు అవసరమైన సమయంలో మీరు చేసుకున్న క్లెయిం చెల్లకపోవచ్చు. అందుకే బీమా ప్రయోజనాలు పొందడానికి, గ్రూపు హెల్త్ ఇన్స్యూరెన్స్ క్లెయిం కొరకు ఫైలింగ్ చేయడానికి ముందు మీరు క్రింది విషయాలు తెలుసుకుంటే మంచిది.

  • మీరు ఉద్యోగి ఐడీ అందుకున్న తర్వాత కంపెనీ పోర్టల్ లో మీ కుటుంబం సమాచారాన్ని అప్ డేట్ చేయండి. బీమాకి సంబంధించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి లేకపోతే క్లెయిం చేయలేరు. 
  • మీ ఆరోగ్య బీమా పాలసీలో చేరిన తర్వాత మీకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(టీపీఏ) ఇచ్చిన కార్డును మీ యజమాని ఇస్తారు. ఒకవేళ మీరు ఆసుపత్రిలో క్యాష్ లెస్ ఫెసిలిటీని ఉపయోగించాలని అనుకున్నట్లయితే, ఈ కార్డు మీకు ఇస్తారు. మీరు ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ కార్డుతో పాటు అదనంగా మీరు ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి.
  • ఆరోగ్య బీమా పాలసీలో చేరేటప్పుడు పాలసీ డాక్యుమెంట్ ఎల్లప్పుడూ క్షుణ్ణంగా చదవండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడేకంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మీరు క్షుణ్ణంగా అందులో ఏమి ఏమి కవర్ చేశారు అనేది తెలుసుకోవాలి. 
  • సాధారణంగా, బీమా కంపెనీలు తమ ఖాతాదారులకు నగదు రహిత సేవలను అందించడానికి ఎంపిక చేసిన ఆసుపత్రుల బృందంతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఆసుపత్రులను ఎంప్యానెల్డ్ నెట్ వర్క్ ఆసుపత్రులుగా పేర్కొంటారు. పాలసీ డాక్యుమెంట్ చదివేటప్పుడు, ఈ ఆసుపత్రుల జాబితా గురుంచి తెలుసుకోండి.
  • బీమా చేసిన వ్యక్తి మీ భీమా నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో బీమా చేసిన వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య బీమా పాలసీ, టీపీఏ ఈ-కార్డు వివరాలను ఆసుపత్రికి అందించాలి. బజాజ్ క్యాపిటల్ జాయింట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. "మీ కుటుంబం ఆరోగ్య సంరక్షణ కోసం భీమా పాలసీకి సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీరు పాలసీ సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడంతో పాటు వాటిని సులభంగా గుర్తించే ప్రదేశంలో ఉంచడం మంచిది" అని అన్నారు.
  • మీరు నెట్ వర్క్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీ వైద్య బిల్లులకు సంబంధించి అన్ని ఖర్చులు ఆసుపత్రి ద్వారా బీమా ప్రొవైడర్ లేదా టీపీఏకు వెళ్తుంది. టీపీఏ ఖర్చులను మదింపు చేసిన తర్వాత బీమా కంపెనీ మీ  క్లెయిం సెటిల్ చేస్తుంది. బీమా విషయం, క్లెయిం ప్రక్రియ, ఆమోదం, సెటిల్ మెంట్ కు సంబంధించి మీ యజమాని లేదా టీపీఏ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కు మీరు తెలియజేయాలి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)