Breaking News

మీకు ఆర్థిక స్వేచ్ఛ ఉందా..?

Published on Mon, 12/02/2024 - 14:19

సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడమే ఆర్థిక స్వేచ్ఛ అని చాలామంది భావిస్తుంటారు. కొందరు అప్పులు లేకుండా ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఇంకొందరు లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్‌ ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా భావిస్తారు. మంచి ఇల్లును సొంతం చేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బు.. ఇందంతా ఒకింత ఆర్థిక స్వేచ్ఛేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, వయసు, జీవన శైలి, కోరికలు, అలవాట్లు ఇలా విభిన్న అంశాలపై ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడుతుందని చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమేరకు స్వేచ్ఛగా ఉన్నారో నిత్యం బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు.

వీటిపై ఓ కన్నేయండి..

ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకుండా  ఖర్చులు అధికమవుతుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛకు దూరమవుతున్నారనే సంకేతాలు వస్తున్నట్లు గ్రహించాలి. నెలవారీ బడ్జెట్‌ను మించి చిన్న అత్యవసరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. దీనివల్ల మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంకేతాలు వస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తిరిగి ఆర్థిక పరిస్థితిని గాడినపడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అప్పులతో జాగ్రత్త

ప్రతి చిన్న కొనుగోలుకు అప్పు చేస్తుంటే మాత్రం పరిస్థితి దిగజారి పోతుందని గ్రహించాలి. అప్పులు ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చినా చాలా తక్కువగానే ఉండాలి. ప్రస్తుతకాలంలో ఈఎంఐ లేకుండా ఏదీ కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని ఈఎంఐలు కలిపి ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. బయట అప్పులు తీసుకొస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేయాలి. ఎందుకంటే అప్పు చెల్లింపులు జాప్యం చేస్తున్న కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది.

అత్యవసర నిధి ఉందా..?

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు.. వంటి వాటిని భరించడం కష్టం. కాబట్టి ముందుగానే దాదాపు ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న మొత్తంతోనైనా ప్రారంభించి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం సాగాలి.

ఇదీ చదవండి: సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?

కుటుంబానికి ఆర్థిక భరోసా

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మీ కుటుంబం మీపైనే ఆధారపడి ఉంటే మీ తదనంతరం వారికి ఆర్థిక భారం మోపకుండా మంచి టర్మ్‌పాలసీను ఎంచుకోవాలి. మీరులేని లోటును ఎవరూ మీ కుటుంబానికి తీర్చలేరు. కనీసం కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కల్పించి రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితబీమా తప్పనిసరి.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)