Breaking News

డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు

Published on Tue, 10/01/2024 - 09:05

డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్‌ డిపాజిట్‌– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్‌ఐపీ) కాంబో ప్రొడక్ట్‌సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత  అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్‌ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

  • ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

  • సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్‌మెంట్‌లో  ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్‌ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

  • రికరింగ్‌ డిపాజిట్‌ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌/ రికరింగ్‌ డిపాజిట్‌–ఎస్‌ఐపీను డిజిటల్‌గా యాక్సెస్‌ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.

  • తాజా ప్రొడక్టులు జన్‌ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్‌ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

  • అంతేకాకుండా, డిపాజిట్‌ సమీకరణ కోసం బ్యాంక్‌ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.

ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!

  • కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్‌ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.

  • ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్‌ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.

  • వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని బ్యాంక్‌ నమోదుచేసింది.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)