Breaking News

ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌

Published on Mon, 04/08/2024 - 01:13

ముంబై: బలమైన డిమాండ్‌ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం(ఎంఎంఆర్‌), పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కత్తా నగరాల్లో క్షీణించాయి.

► ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్‌లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి.  
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్‌కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.  


‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్‌ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్‌తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)