Breaking News

గృహ పొదుపులే ఆదుకుంటాయ్‌

Published on Thu, 09/05/2024 - 06:32

ముంబై: గృహ పొదుపులు ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి అవసరాలకు మద్దతుగా నిలుస్తున్నాయని (వృద్ధికి) ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మేకేల్‌ దేబబ్రత పాత్ర అన్నారు. వెలుపలి నిధులను కేవలం అదనపు మద్దతుగా పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘‘గృహాలకు సంబంధించి నికర ఆర్థిక పొదుపులు 2020–21 నుంచి చూస్తే సగానికి తగ్గాయి. కరోనా విపత్తు సమయంలో వివేకంతో దాచుకున్న పొదుపులు ఇల్లు వంటి భౌతిక ఆస్తుల్లోకి మళ్లుతుండడమే దీనికి కారణం. 

రానున్న రోజుల్లో పెరిగే ఆదాయాలతో గృహ పొదుపులు తిరిగి ఆర్థిక సాధనాల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2011–17 నాటికి జీడీపీలో గృహ ఆర్థిక పెట్టుబడులు 10.6 శాతంగా ఉంటే, 2017–23 నాటికి 11.5 శాతానికి చేరాయి’’అని పాత్ర వివరించారు. కరోనా అనంతరం భౌతిక పొదుపులు సైతం జీడీపీలో 12 శాతానికి పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయన్నారు. 

ప్రైవేటు కార్పొరేట్‌ రంగం నికర రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్టు చెప్పారు. మూలధన వ్యయాల సైకిల్‌ పుంజుకున్నందున కార్పొరేట్‌ రంగం రుణాలు ఇకమీదట పెరగొచ్చని అంచనా వేశారు. ఈ విధమైన రుణ అవసరాలను గృహ పొదుపులతోపాటు, వెలుపలి వనరులు తీరుస్తాయన్నారు. ఆర్థిక ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ విదేశీ నిధులను సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, కరెన్సీ విషయంలో ఆర్‌బీఐ పాత్రను ఇదే సమావేశంలో భాగంగా సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ మెచ్చుకున్నారు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)