Breaking News

హానర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: 200 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో రీఎంట్రీ!

Published on Fri, 07/28/2023 - 11:48

Honor 90 Coming Soon చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్‌ మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌తో భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. ఇప్పటికే  ఇతర మార్కెట్లలో లాంచ్‌ అయిన హానర్​ 90ని ఇక్కడ లాంచ్‌ చేయనుంది. 

దీనికి తోడు రియల్‌మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్‌ హానర్ ఇండియా హెడ్‌కు రానున్నారు. ఇటీవల దుబాయ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మాధవ్‌ సందడి చేశారు. అలాగే 15 మంది ఉద్యోగులతో పాటు కొంతమంది ఉన్నతాధికారులు Realmeకి గుడ్‌బై చెప్పి ఇప్పటికే HonorTechలో చేరారని ఐఏఎన్‌ఎస్‌ నివేదించిన నేపథ్యంలో  ఈ వార్తలకు బరింత బలం చేకూరింది.  (జియో ఫైబర్‌ రూ. 398 ప్లాన్‌, ఆఫర్లేంటో తెలుసా?)

ఖచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ, టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరి  లీక్‌ చేసిన వివరాల ప్రకారం  హానర్​ 90 లాంచ్​ సెప్టెంబర్​ మధ్యలో  ఉంటుందని  ధర రూ. 50వేలలోపు ఉంటుందట.  అంటే  సెగ్మెంట్​లో   వన్‌ప్లస్‌​ 11ఆర్​, ఒప్పో రెనో 10 ప్రో, నథింగ్​ ఫోన్​ 2  లాంటి  స్మార్ట్‌ఫోన్లకు గట్టి పో వ్వనుందని అంచనా.  పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు ఎమరాల్డ్ గ్రీన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా నాలుగు విభిన్న రంగులలో అందుబాటులోకి రానుంది. ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు అంచనాలు ఇలా ఉన్నాయి. 

హానర్‌ 90 ఫీచర్లు అంచనాలు
6.7 ఇంచ్​ అమోలెడ్​ డిస్‌ప్లే
స్నాప్​డ్రాగన్​ 7 జెన్​ 1 ఎస్​ఓసీ
200+12+2  ఎంపీ ట్రిపుల్‌ రియర్‌కెమెరా
50ఎంపీ  సెల్పీ కెమెరా
5000ఎంఏహెచ్​ బ్యాటరీ,66వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​

కాగా కొన్నేళ్ల  క్రితం హువావే  ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్,అమెరికా గూగుల్‌ సేవలను ఉపయోగించ కుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు  ఎదుర్కొంది. కానీ హానర్‌ ఇండియాలో మాత్రం కొత్త ఉత్పత్తులను కొనసాగించింది. Honor Watch ES, Honor Pad 5 వంటి స్మార్ట్‌వాచ్‌లు టాబ్లెట్‌లపై దృష్టి సారించింది. మరోవైపు  ఇండియాలో  హానర్ విడుదల చేసిన చివరి స్మార్ట్‌ఫోన్. రూ.10వేల బడ్జెట్‌ ధరలో హానర్‌ 9ఏ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)