Breaking News

హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు.. చిక్కుల్లో చైనా కంపెనీ!

Published on Mon, 01/29/2024 - 14:40

చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఎవర్‌గ్రాండే' గ్రూప్‌ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. రుణదాతలతో పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

ఆచరణాత్మకమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతోపాటు, కంపెనీ దివాళా దిశగా అడుగులేస్తున్న కారణంగానే కంపెనీ మూసివేస్తేనే మంచిదని పేర్కొంటూ హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఎవర్‌గ్రాండే గ్రూప్‌ లిక్విడేషన్ జరిగితే.. స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ మొత్తం 240 బిలియన్ డాలర్లు, కాగా.. సంస్థ చేసిన అప్పులు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు.

ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ

హాంకాంగ్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్‌గ్రాండే స్టాక్స్ 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా కొంత సేపు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. చైనాలోని రియాల్టీ రంగంలో రుణాలు అదుపు తప్పాయి. వాటిని నియంత్రించడంతో పాటు.. రియాల్టీ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు చైనా రెగ్యులేటరీ సంస్థలు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఫలితంగా ఎవర్‌గ్రాండే వంటి చాలా కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఇదే ప్రస్తుతం కంపెనీని దివాళా అంచులకు తీసుకువెళ్ళింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)