Breaking News

ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!

Published on Sat, 02/14/2026 - 19:20

హోండా మోటార్‌సైకిల్‌ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్‌తో లభిస్తుంది.

సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)