Breaking News

90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన

Published on Sat, 10/26/2024 - 17:41

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్‌లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.

2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్‌లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.

రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.

హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్‌డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్‌లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)