తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం
Breaking News
ఇళ్ల అమ్మకాలు @ రూ.2.98 లక్షల కోట్లు
Published on Tue, 11/11/2025 - 04:17
న్యూఢిల్లీ: ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) సంఖ్యా పరంగా తక్కువ నమోదు కాగా, విలువ పరంగా వృద్ధి కనిపించింది. అమ్మకాలు 1.93 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 2.27 లక్షల యూనిట్లతో పోల్చి చూస్తే 15 శాతం తగ్గాయి. కానీ, ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2.98 లక్షల కోట్లుగా నమోదైంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల విలువ రూ.2.79 లక్షల కోట్లుగా ఉంది. అంటే విలువ పరంగా 7 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద విక్రయాల విలువ క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 19 శాతం అధికంగా రూ.6.65 లక్షల కోట్లుగా ఉండొచ్చని అనారక్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ అంచనా వేశారు.
సగటు ధరలు, అపార్ట్‌మెంట్ సగటు పరిమాణం ఆధారంగా ఈ అంచనా వ్యక్తం చేశారు. 2024–25లో దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 4,22,765 యూనిట్లు కాగా, వీటి విలువ రూ.5.59 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. 2023–24లో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరిన అనంతరం ఎన్నో ప్రతికూలతల మధ్య ఆ తర్వాత కొంత నెమ్మదించినట్టు పేర్కొన్నారు.
ధరల పెరుగుదల వల్లే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాల విలువ అధికంగా నమోదు కావడం వెనుక ధరలు పెరగడాన్ని కారణంగా అనరాక్ నివేదిక పేర్కొంది. అలాగే, ప్రీమియం అపార్ట్‌మెంట్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. స్పెక్యులేటివ్ కొనుగోళ్లకు బదులు వాస్తవ, వినియోగ ఆధారిత కొనుగోళ్ల డిమాండ్ ప్రస్తుతం కొనసాగుతున్నట్టు సర్వమ్ ప్రాపరీ్టస్ సహ వ్యవస్థాపకుడు ధావల్ హెమానీ తెలిపారు.
రియల్ ఎస్టేట్‌లో తదుపరి వృద్ధి అమ్మకాల పరిమాణం కంటే విలువ ఆధారితంగానే ఉంటుందని రియల్ స్టేట్ రంగ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ‘గోల్డెన్ గ్రోత్ ఫండ్’ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు. డెవలపర్లు ఎక్కువ ప్రాజెక్టుల కంటే.. నాణ్యత, సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పంగించడంపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.
Tags : 1