Breaking News

ఆర్‌బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట

Published on Wed, 04/09/2025 - 11:05

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్‌ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్‌ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

గృహ రుణంపై ఊరట ఎంతంటే..?

ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం

రెపో రేటు అంటే..

రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)