Breaking News

ఐదేళ్లలో అత్యధికం.. లాభాల్లో హోండా మోటార్‌సైకిల్‌

Published on Thu, 10/09/2025 - 13:50

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా నికర లాభం గతేడాది (2024–25) 38 శాతం జంప్‌చేసి రూ. 3,727 కోట్లకు చేరింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం కాగా.. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది (2023–24)లో రూ. 2,705 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 39,238 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 31,945 కోట్ల టర్నోవర్‌ సాధించింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. జపనీస్‌ ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్‌కు చెందిన దేశీ అనుబంధ అన్‌లిస్టెడ్‌ సంస్థ ఇది.

ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) వివరాల ప్రకారం.. గతేడాది రిటైల్‌గా 1,88,77,812 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. వీటిలో హోండా మోటార్‌సైకిల్‌ రిటైల్‌ అమ్మకాలు 47,89,283 యూనిట్లుగా నమోదయ్యాయి. వెరసి హీరో మోటోకార్ప్‌(54,45,251 యూనిట్లు) తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలిచింది. కాగా.. 2030కల్లా దేశీ ద్విచక్ర వాహన మార్కెట్లో 30 శాతం వాటాపై హోండా మోటార్‌సైకిల్‌ కన్నేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)