హిందాల్కో లాభం జూమ్‌

Published on Wed, 05/21/2025 - 01:04

న్యూఢిల్లీ: మెటల్‌ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 66 శాతం జంప్‌చేసి రూ. 5,284 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు పుంజుకోవడం, ముడివ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 55,994 కోట్ల నుంచి రూ. 64,890 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,155 కోట్ల నుంచి రూ. 16,002 కోట్లకు జంప్‌ చేసింది. మొత్తం ఆదాయం రూ. 2,15,962 కోట్ల నుంచి రూ. 2,38,496 కోట్లకు బలపడింది.  

ఈఎంఐఎల్‌ మైన్స్‌కు ఓకే 
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినట్లు హిందాల్కో ఎండీ సతీష్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఇందుకు నిలకడైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణకుతోడు అన్ని బిజినెస్‌లకు నెలకొన్న డిమాండ్‌ దోహదపడినట్లు తెలియజేశారు. ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సొంత అనుబంధ సంస్థ ఈఎంఐఎల్‌ మైన్స్‌ మినరల్‌ రిసోర్సెస్‌ కొనుగోలుకి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు హిందాల్కో పేర్కొంది. బంధా కోల్‌ బ్లాకు లీజ్‌ హక్కులు కలిగిన ఈఎంఐఎల్‌ మైన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.
హిందాల్కో షేరు బీఎస్‌ఈలో 0.7% బలపడి రూ. 663 వద్ద ముగిసింది.

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)