Breaking News

ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..!

Published on Tue, 12/12/2023 - 12:24

కార్పొరేట్‌  సంస్థల్లో చిన్న ఉద్యోగి నుంచి మొదలుకుని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వర​కు అందరూ కీలకమే. కానీ వారి బాధ్యతలను అనుసరించి వారికి చెల్లించే వేతనాల్లో తేడా ఉంటుంది. ప్రతి కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)ల అత్యంత కీలకం.. కంపెనీ అభివృద్ధి సాధించే వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే వారి వేతనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

అమెరికాలో 2023 సంవత్సరానికిగాను అత్యధిక వేతనాలు అందుకున్న సీఈఓల్లో సుందర్ పిచాయ్, బ్యారీ మైక్ కార్తీ, టిమ్ కుక్ తదితరులు ఉన్నారు.  గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం అక్షరాల 226 మిలియన్ డాలర్లు(రూ.1800 కోట్లు). దాంతో ఆయన రోజూ రూ.5 కోట్లు వేతనం పొందుతున్నారు. అమెరికాలోని కార్పొరేట్ సంస్థల సీఈఓల వేతనంతో పోలిస్తే సుందర్ పిచాయ్ వేతనం అత్యధికం.

అతిపెద్ద కార్ల రెంటల్ కంపెనీల్లో హెర్ట్జ్ ఒకటి. దాని సీఈఓ స్టీఫెన్ స్కెర్ వేతనం 182 మిలియన్ డాలర్లు(రూ.1500 కోట్లు). అమెరికన్ ఎక్సర్‌సైజ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ పెలోటాన్ ఇంటర్ యాక్టివ్ సంస్థ సీఈఓగా బ్యారీ మైక్ కార్తీ ఉన్నారు. ఆయన వార్షిక వేతనం 168 మిలియన్ డాలర్లు(రూ.1400 కోట్లు).

ఇదీ చదవండి: ‘ఎవరు చనిపోయినా అవి మాత్రం ఆగవు’

అమెరికాలో లైవ్ నేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సీఈఓగా మిచెల్ రాపినో పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 139 మిలియన్ డాలర్లు(రూ.1100 కోట్లు). గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పినారెస్ట్ ఒకటి. దీనికి విలియం రెడీ సీఈఓగా పని చేస్తున్నారు. ఆయన వార్షిక వేతనం 123 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు). ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టెక్ దిగ్గజం ఆపిల్. దీనికి సీఈఓగా పని చేస్తున్న టిమ్ కుక్ వార్షిక వేతనం 99 మిలియన్ డాలర్లు(రూ.825 కోట్లు).

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)