Breaking News

ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలు

Published on Tue, 12/02/2025 - 08:12

న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్‌ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్‌ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్‌లోకి వచి్చన హౌసింగ్‌ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది.  

⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్‌పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి. 

⇒  భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్‌–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్‌ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.  

⇒  సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్‌ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్‌క్రాఫ్ట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు.  

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)