Breaking News

భారీగా పెరిగిన ఇళ్ల సేల్స్: రూ.50 కోట్లయినా తగ్గేదెలే..

Published on Sat, 04/12/2025 - 15:21

ఇంటి బడ్జెట్‌ అంటే లెక్కేలేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.50 కోట్లయినా సునాయాసంగా ఖర్చు చేసేస్తున్నారు. గతంలో ఇల్లు కొనాలంటే బడ్జెట్‌ను ప్రధానంగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ, ఇప్పుడు ఎంత ఖరీదైన ఇళ్లయితే అంత గొప్ప. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా ప్రీమియం, అల్ట్రా లగ్జరీ గృహాలను నిర్మిస్తున్నారు. ఏటేటా అందుబాటు గృహాల విక్రయాలు తగ్గుతూ.. అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. – సాక్షి, సిటీబ్యూరో

ఖరీదైన ఇళ్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి
ఏటేటా రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్‌ గృహాల విక్రయాలు తగ్గుతున్నాయి. వీటి స్థానంలో రూ.50 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ యూనిట్ల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరి - మార్చి(క్యూ1)లో అమ్ముడైన ఇళ్లలో అందుబాటు గృహాలు 21,010గా ఉన్నాయి కానీ, గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ విభాగంలో సేల్స్‌ 9 శాతం మేర తగ్గాయి. అదే 2025 క్యూ1లో 169 అల్ట్రా లగ్జరీ యూనిట్లు అమ్ముడుపోగా.. గతేడాది క్యూ1తో పోలిస్తే ఏకంగా 483 శాతం వృద్ధి నమోదైంది. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉండే ఇళ్లు 26,832 సేల్‌ కాగా.. 2024 తొలి త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం తక్కువ.

ఇక, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర ఉండే యూనిట్లు 2 శాతం వృద్ధి రేటుతో 22,230 అమ్ముడుపోయాయి. రూ.2–5 కోట్ల ధర ఉండే ఇళ్లు 28 శాతం వృద్ధితో 13,735 సేల్‌ అయ్యాయి. అలాగే రూ.5–10 కోట్లు ధర ఉండే గృహాలు 82 శాతం పెరుగుదలతో 3,448 సేల్‌ అయ్యాయి. రూ.10–20 కోట్లు ఖరీదు చేసే యూనిట్లు 114 శాతం వృద్ధి రేటుతో 658 అమ్ముడయ్యాయి. అలాగే రూ.20–50 కోట్ల ధర ఉండే ప్రీమియం ఇళ్లు 124 శాతం వృద్ధితో 92 యూనిట్లు అమ్ముడుపోయాయి.

88,274 ఇళ్ల విక్రయాలు..
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 88,274 యూనిట్లు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. 2025 క్యూ1లో కొత్తగా 96,309 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 2024 క్యూ1తో పోలిస్తే ఇది 3 శాతం అధికం. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9,459 ఇళ్లు అమ్ముడుపోగా.. 10,661 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి.

ఆఫీసు స్పేస్‌ అధరహో..
దేశంలోని 8 ప్రధాన నగరాలలో 2025 క్యూ1లో 2.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 44 శాతం వాటా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లదే(జీసీసీ). 2025 క్యూ1లో జరిగిన లీజుల్లో అత్యధికంగా 1.24 కోట్ల చ.అ. స్థలాలు జీసీసీల ఏర్పాటు కోసమే జరగడం గమనార్హం. ఆఫీసు స్పేస్‌లలో ఐటీ హబ్‌లైన్‌ బెంగళూరు, హైదరాబాద్‌ తీవ్రంగా పోటీపడుతున్నాయి. హైదరాబాద్‌ 2025 క్యూ1లో 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. గతేడాది చివరి త్రైమాసికం (క్యూ4)లో 31 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. నగరంలో గృహాలు, ఆఫీసు స్థలాల అద్దెలు ఏటా 9 శాతం మేర పెరుగుతున్నాయి.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)