Breaking News

బిగ్‌ బ్రో.. హే చోటా బ్రో.. ఆనంద్‌ మహీంద్రా, నాగాలాండ్‌ మంత్రి ఫన్నీ ట్వీట్స్‌!

Published on Sun, 08/20/2023 - 19:07

మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra), నాగాలాండ్ మంత్రి, బీజేపీ నేత టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ (Temjen Imna Along) మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది.  ఆనంద్‌ మహీంద్రాను మంత్రి అలోంగ్‌ బిగ్‌ బ్రో అని సంబోధించగా.. మంత్రిని ఆనంద్‌ మహీంద్రా చోటా బ్రో అంటూ సంబోధించారు.

నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ఇటీవల ఎక్స్‌ (ట్విటర్)లో మహీంద్రా థార్ ఎలక్ట్రిక్‌ వాహన (Mahindra Thar.e) చిత్రాన్ని పోస్ట్ చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రాను ట్యాగ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. మహీంద్రా థార్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని అలోంగ్ ప్రశంసిస్తూ ‘బిగ్‌ బ్రో ఆనంద్‌ మహీంద్రా.. కొత్త వాహనం నెక్ట్స్‌ లెవల్‌లో ఉంది’ అంటూ రాసుకొచ్చారు. వాహనాన్ని రూపొందించిన బృందానికి అభినందనలు తెలియజేశారు.

అలోంగ్‌ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా కూడా ప్రతిస్పదించారు. ‘హే చో బ్రో (చోటా బ్రో)’ అంటూ ఆప్యాయంగా సంబోధించారు. మహీంద్రా థార్‌.ఈ వాహనాన్ని ఉద్దేశిస్తూ ఇది మీ స్థాయికి చేరిందంటూ పేర్కొన్నారు. ఈ వాహనం లాంచ్‌ అయిన తర్వాత మిమ్మల్ని షికారుకు తీసుకెళ్తుందని అలోంగ్‌కు తెలియజేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)