Breaking News

Hero Super Splendor XTEC: ఎక్కువ మైలేజ్, అప్డేటెడ్ ఫీచర్స్.. ధర ఎంతంటే?

Published on Mon, 03/06/2023 - 18:58

భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఉగాది పండుగకు ముందే సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ విడుదల చేసింది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 83,368, రూ. 87,268 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ పొందుతుంది. ఇందులో ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ లెవెల్ వంటి వాటిని తెలుసుసుకోవచ్చు. ఇది 125 సీసీ విభాగంలో విడుదలైన కొత్త బైక్.

హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.84 బీహెచ్‌పి పవర్, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ 68 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, విజర్, డ్యూయల్-టోన్ స్ట్రిప్స్ వంటి వాటిని పొందటమే కాకుండా, గ్లోస్ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మాట్ యాక్సిస్ గ్రే కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)