Breaking News

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండిలా..

Published on Tue, 12/31/2024 - 12:47

ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా ప్రకటనల్లో క్యూఆర్‌ కోడ్‌ను గమనిస్తుంటాం. ఆ కోడ్‌ను స్కాన్‌(Scan) చేస్తే నేరుగా సదురు ప్రకటన వివరాలు తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని ఫిజికల్‌గా ప్రకటనల్లో ఇవ్వడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. దాంతో చాలా కంపెనీలు క్యూఆర్‌(QR Code) కోడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేవలం కంపెనీ ఉత్పత్తుల వివరాలే కాకుండా విద్య, వైద్యం, పరిశ్రమలు, బీమా రంగం.. ఇలా ఏ విభాగంలో చూసినా క్యూఆర్‌ కోడ్‌తో సమాచారాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైనా డివైజ్‌ల్‌ ఉన్న క్యూఆర్‌ను లేదా ఫేన్‌పే, జీపే వంటి లావాదేవీలకు సంబంధించిన క్యూఆర్‌ను స్కాన్‌ చేయడం సులువే. కానీ మీకు ఎవరైనా సాఫ్ట్‌కాపీ(Soft Copy) పంపించి అందులో క్యూఆర్‌ కోడ్‌ సమాచారం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు.. మీకు వచ్చిన క్యూఆర్‌ను తిరిగి వేరే ఫోన్‌కు పంపించి అందులోనుంచి మీ డివైజ్‌లో స్కాన్‌ చేస్తారు కదా. ఇది అన్నివేళలా కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో సులువుగా క్యూఆర్‌ స్కాన్‌ చేసే మార్గం ఉంది.

గూగుల్‌ లెన్స్‌

ఫోన్ స్క్రీన్ నుంచి నేరుగా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయడానికి గూగుల్‌ లెన్స్‌ను వినియోగించడం సులువైన మార్గం. దీన్ని గూగుల్‌ సదుపాయం ఉన్న ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫోన్లలో ఉపయోగించవచ్చు.

ఎలా ఉపయోగించాలంటే..

  • ఫోన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను స్క్రీన్‌షాట్‌(Screen Shot) తీసుకోవాలి.

  • గూగుల్‌ ఫోటోలు లేదా గూగుల్‌(Google) యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

  • సెర్చ్‌ బటన్‌ పక్కన లెన్స్‌ సింబల్‌ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్‌ చేసిన వెంటనే గ్యాలరీకి యాక్సెస్‌ అడుగుతుంది.

  • ఫోటోలకు యాక్సెస్‌ ఇచ్చి అప్పటికే స్క్రీన్‌షాట్‌ తీసుకున్న క్యూఆర్‌ కోడ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

  • గూగుల్‌ లెన్స్‌(Google Lens)లోని కృత్రిమమేధ మీరు సెలక్ట్‌ చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి నేరుగా అందులోని సమాచారాన్ని రీడైరెక్ట్‌ చేస్తుంది.

  • వేరే ఫోన్‌ అవసరం లేకుండానే నేరుగా సాఫ్ట్‌కాపీ లేదా స్క్రీన్‌షాట్‌ తీసిన క్యూఆర్‌ వివరాలు తెలుసుకునేందుకు ఇలా ప్రయత్నించవచ్చు.

ఇదీ చదవండి: భలే ఛాన్స్‌.. తగ్గిన బంగారం ధర! తులం ఎంతంటే..

ప్రస్తుతం చాలా ఫోన్‌ తయారీ కంపెనీలు వాటి కెమెరాలు లేదా గ్యాలరీ యాప్‌ల్లోనే నేరుగా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అంటే గూగుల్‌ లెన్స్‌ అవసరం కూడా లేకుండానే నేరుగా కెమెరా ఆన్‌ చేసి క్యూఆర్‌ను స్కాన్‌ చేయవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)