Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా కమ్యూనికేషన్స్‌, హడ్కో ఫలితాలు

Published on Thu, 01/23/2025 - 08:57

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో స్టాండెలోన్‌ నికర లాభం 2% నామమాత్ర వృద్ధితో రూ.16,736 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.16,373 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 17,258 కోట్ల నుంచి రూ.17,657 కోట్లకు స్వల్పంగా బలపడింది. రుణ వృద్ధి నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,15,016 కోట్ల నుంచి రూ. 1,12,194 కోట్లకు క్షీణించింది.  

వడ్డీ ఆదాయం ప్లస్‌...

ప్రస్తుత సమీక్షా కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ.30,650 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,450 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.43 శాతం వద్ద నిలకడను చూపాయి. ఆస్తుల (రుణాల) నాణ్యత విషయానికివస్తే తాజా స్లిప్పేజీలు రూ. 6,400 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.26 శాతం నుంచి 1.42 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగశాయి. అనుబంధ సంస్థలలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నికర లాభం రూ. 470 కోట్లను తాకగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రూ. 410 కోట్లు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రూ. 640 కోట్లు, సెక్యూరిటీస్‌ రూ. 270 కోట్లు చొప్పున లాభాలు ఆర్జించాయి.  

టాటా కమ్యూనికేషన్స్‌ లాభం హైజంప్‌

రూ.257 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ.  257 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 45 కోట్లు ఆర్జించింది. అయి తే పన్ను సంబంధిత రూ. 185 కోట్ల వన్‌టైమ్‌ ప్రొవిజన్‌ ఇందుకు కారణం. కాగా.. మొత్తం ఆదా యం 3% బలపడి రూ. 5,798 కోట్లను తాకింది.

ఇదీ చదవండి: ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను

రాణించిన హడ్కో

డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.735 కోట్ల లాభం

న్యూఢిల్లీ: పట్టణ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు రుణాలు అందించే ప్రభుత్వరంగ హడ్కో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు పరంగా రాణించింది. సంస్థ కన్సాలిడేటెడ్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 42 శాతం వృద్ధితో రూ.735 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.519 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం ఇదే కాలంలో రూ.2,023 కోట్ల నుంచి రూ.2,770 కోట్లకు వృద్ధి చెందింది. వాద్వాన్‌ పోర్ట్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ (వీపీపీఎల్‌)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని సమకూర్చే అవకాశాలను ఈ ఒప్పందం కింద పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. వీపీపీఎల్‌ అన్నది జవహర్‌లాన్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్, మహారాష్ట్ర మారిటైమ్‌ బోర్డ్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)