Breaking News

ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?

Published on Mon, 08/05/2024 - 16:34

ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు  ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్‌ అని స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్‌ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)