Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 39% జంప్‌

Published on Wed, 01/17/2024 - 08:24

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. 

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్‌ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్‌ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది.  

ఎన్‌పీఏలు ఇలా... 

బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్‌పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది.   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)