Breaking News

మెరుగైన రాబడులకు మార్గం

Published on Mon, 02/16/2026 - 20:55

ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్‌ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్‌ ఫండ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ ఒకటి.

రాబడులు
ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్‌ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

పెట్టుబడుల విధానం
ఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్‌క్యాప్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.

ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్‌ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్‌ (ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్‌ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. రియల్‌ ఎస్టెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.

పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్‌ చేయగా, రియల్‌ ఎస్టేట్‌ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్‌ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్‌ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.

ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్‌ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)