Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ విలీనం: వరల్డ్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ బ్యాంక్స్‌లో స్థానం

Published on Sat, 07/01/2023 - 12:03

న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్‌గేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్‌ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్‌), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం కానుంది. ఈ విలీనంతో  భారతీయ కంపెనీ  తొలిసారి  ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది.

దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్‌కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్‌కుగల డిజిటైజేషన్‌ ప్లాట్‌ ఫామ్‌లతో పాటు.. భారీ పంపిణీ నెట్‌వర్క్‌ గృహ రుణాలతోపాటు గ్రూప్‌ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు.  (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్‌’ కూడా అదేనట!)

విలీనంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది.  

విలీనానికి బోర్డుల గ్రీన్‌సిగ్నల్‌ 
ఫైనాన్షియల్‌ రంగ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం కానుంది.     (టీసీఎస్‌: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట)

కాగా, బీమా రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో మార్టగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.  వారాంతాన బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు  1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది.  

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)