Breaking News

HDFC Bank Q4 Results: లాభాలతో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..

Published on Mon, 04/17/2023 - 07:35

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగసి రూ. 12,595 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం నికర లాభం ఇదే స్థాయిలో బలపడి రూ. 45,997 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 19 చొప్పున డివిడెండు ప్రకటించింది. మొత్తం బ్రాంచీల సంఖ్య 7,821కు చేరింది. క్యూ4లో 6,000 మందికి ఉపాధి కల్పించింది. మొత్తం సిబ్బంది సంఖ్య 1,73,222ను తాకింది.  

స్టాండెలోన్‌ సైతం 
క్యూ4లో స్టాండెలోన్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 20 శాతం పుంజుకుని రూ. 12,048 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 23,352 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదుకాగా.. 17 శాతం రుణ వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం రూ. 7,637 కోట్ల నుంచి రూ. 8,731 కోట్లకు పెరిగింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,312 కోట్ల నుంచి రూ. 2,685 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 0.4 శాతం బలపడి 19.3 శాతాన్ని తాకింది. అనుబంధ సంస్థలలో బ్రోకింగ్‌ విభాగం లాభం రూ. 236 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు నీరసించగా.. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లాభం 28 శాతం ఎగసి రూ. 545 కోట్లను దాటింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)