హోమ్‌ లోన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న భారం!

Published on Sat, 06/08/2024 - 15:43

హోమ్‌ లోన్‌ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ వడ్డీ రేట్లలో (ఎంసీఎల్‌ఆర్‌) మార్పులు చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో 9.35 శాతంగా ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ 9.30 శాతానికి తగ్గింది. ఫలితంగా అదే కాలపరిమితికి హోమ్ లోన్ రేట్లు తగ్గనున్నాయి. అయితే, ఇతర కాలపరిమితి రుణాలకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ 2024 జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.

ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అనేది బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, కాలపరిమితి ప్రీమియం వంటి అంశాల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. సాధరణంగా ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే ఈఎంఐల భారం తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్‌ర్క్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంది. ఎంసీఎల్ఆర్ సవరణల ప్రభావం తక్షణమే ఉండదని గమనించాలి. ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ రుణాలకు రీసెట్ పీరియడ్ ఉంది. ఆ తర్వాత రుణగ్రహీతలకు రేట్లు సవరిస్తారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)